వరంగల్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్: కేటీఆర్

ktrwglవరంగల్ నగర అభివృద్ధికోసం అన్ని అంశాలతో కూడిన మాస్టర్ ప్లాన్‌కు రూపకల్పన చేయాలన్నారు మంత్రి మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం (ఏప్రిల్-4) వరంగల్‌ జిల్లాలో మంత్రులు కడియం, కేటీఆర్‌, చందూలాల్‌ పర్యటించారు. పర్యటనలో భాగంగా మంత్రులు హన్మకొండలో కాకతీయ మాస్టర్‌ప్లాన్‌పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

పనులు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా అన్ని అంశాలను పరిశీలించి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్. అంతకు ముందు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కోటి రూపాయల ఖర్చుతో నిర్మించనున్న హన్మకొండ బస్టాండ్‌ కూడలి అభివృద్ధి పనులను ప్రారంభించారు . 2.03 కోట్ల రూపాయలతో పద్మాక్షిగుట్ట జైన విగ్రహం పరిసర ప్రాంత అభివృద్ధి పనులకు శంకుస్ధాపన చేశారు.

8.97 కోట్ల రూపాయలతో ఖిలా వరంగల్‌లో ఉత్తర ప్రవేశ ద్వారం, శృంగార బావి పునరుద్ధరణ పనులకు, రూ.1.75 కోట్లతో రంగసముద్ర బండ్ అభివృద్ధి పనులకు, మడిపల్లి వద్ద రెండు వందల ఎకరాల టౌన్ షిప్ అభివృద్ధి పనులకు శంకుస్ధాపన చేశారు. మహిళా సంఘాలకు రూ.2 కోట్ల 28 లక్షల 55 వేల 718 చెక్‌ను అందచేశారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates