వరంగల్ కు చేరిన శరత్ డెడ్ బాడీ

అమెరికాలో దుండగుడి కాల్పుల్లో చనిపోయిన విద్యార్థి శరత్ డెడ్ బాడీ రాష్ట్రానికి చేరింది. జూలై-6వ తేదీన చనిపోయిన విద్యార్థి కొప్పు శరత్ మృతదేహాన్ని జూలై-11 రాత్రి స్వస్థలం వరంగల్ కు తరలించారు. ఎయిర్ ఇండియా విమానంలో అమెరికా నుంచి మొదట ముంబయికి, అక్కడి నుంచి హైదరాబాద్ కు శరత్ డెడ్ బాడీని తీసుకొచ్చారు. రాత్రి పదిన్నర గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. శరత్ తండ్రి రామ్మోహన్, ఇతర కుటుంబసభ్యులు, సన్నిహితులు బోరున ఏడ్చారు.

కేంద్రమాజీమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు, నరేందర్ రెడ్డి, సైబరాబాద్ సీపీ సజ్జనార్.. శరత్ కు నివాళులర్పించారు. విదేశాంగశాఖమంత్రి సుష్మస్వరాజ్ చొరవతో డెడ్ బాడీ త్వరగా రాష్ట్రానికి వచ్చిందన్నారు ఎంపీ బండారు దత్తాత్రేయ. తర్వాత శరత్ తండ్రి రామ్మోహన్ తోపాటు కుటుంబీకులను పరామర్శించి ఓదార్చారు. ఎయిర్ పోర్ట్ నుంచి శరత్ మృతదేహాన్ని స్వస్థలం వరంగల్ జిల్లా కరీమాబాద్ కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్ లో తీసుకెళ్లారు. ఇవాళ అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు కుటుంబ సభ్యులు.
మె
కాన్సస్ సిటీలోని యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరిలో ఎంఎస్ చదివేందుకు ఈ ఏడాది జనవరిలోనే అమెరికా వెళ్లాడు శరత్. హైదరాబాద్ లోని వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ పూర్తిచేసిన శరత్.. కొన్నాళ్లు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేశాడు. కాన్సస్ లోని రెస్టారెంట్ లో శరత్ పై ఓ దుండగుడు ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. కాల్పులకు పాల్పడ్డ అనుమానితుడిని కాన్సస్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. దుండగుడి ఆచూకీ చెప్పిన వారికి 10 వేల యూఎస్ డాలర్లు రివార్డు ప్రకటించారు అమెరికా పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates