వరంగల్ బస్ డిపోలో అగ్నిప్రమాదం: 5బస్సులు దగ్ధం

వరంగల్ బస్ డిపోలో గురువారం (ఆగస్టు-2) అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదు బస్సులు ..కాలిపోయాయి. ఒక బస్సును సాంకేతిక లోపంతో డిపోలో పక్కకు పెట్టారు. ఆ బస్సులో మంటలు చెలరేగి.. దాని పక్కనే ఉన్న మరో నాలుగు బస్సులకు మంటలు అంటుకున్నాయి. ప్రమాదాన్ని గమనించిన కార్మికులు వెంటనే..నీళ్ల పోసి మంటలను అదుపులోకి తెచ్చారు. బస్సుల టైర్లకు మంటలు అంటుకుంటే.. భారీ నష్టం జరిగేదంటున్నారు కార్మికులు. ఫైర్ యాక్సిడెంట్ పై రవాణామంత్రి మహేందర్ రెడ్డి ఆరా తీశారు. ప్రమాదంపై విచారణ జరిపి.. నివేదిక ఇవ్వాలని ఆదేశించారు మంత్రి.డిపోలో 50లక్షల వరకు నష్టం జరిగి ఉంటుందని  అంచనా వేస్తున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates