వరంగల్ లో ఇక్బాల్ మినార్ వివాదం : అర్ధరాత్రి అట్టుడికిన పోచమ్మ మైదాన్‌

వరంగల్ పోచమ్మమైదాన్ చౌరస్తాలో కొత్తగా నిర్మిస్తున్న ఇక్బాల్ మినార్ వివాదానికి కారణమైంది. డివైడర్ మధ్యలో ఇక్బాల్ మినార్ నిర్మిస్తుండటంతో GWMC అధికారులు కూల్చివేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ముస్లీంలు గురువారం(జూలై-19) రాత్రి ఆందోళన చేశారు. ముస్లీంలకు మద్దతుగా ఎమ్మెల్యే కొండాసురేఖ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇక్బాల్ మినార్ ను ధ్వంసం చేసినవారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

సారే జహాసే అచ్చా గీతాన్ని రాసిన ఇక్బాల్‌ గుర్తుగా పోచమ్మమైదాన్‌ కూడలిలో స్తూపాన్ని నిర్మించారు. ఇది శిథిలావస్థకు చేరడంతో దాన్ని పునర్నిర్మించాలని ప్రయత్నించారు. దీనిలో భాగంగా మూడు రోజుల క్రితం ఎమ్మెల్సీ కొండా మురళి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. పోచమ్మమైదాన్‌ కూడలి నుంచి కాశీబుగ్గ మార్గంలోని డివైడర్‌ మధ్యలో నిర్మించాలని పనులు ప్రారంభించారు. అయితే డివైడర్‌ ను కూల్చి పనులు ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ.. కొందరు GWMC కమిషనర్‌ కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు పనులను అడ్డుకొని అప్పటివరకు నిర్మించిన మీనార్‌ ను కూల్చివేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

Posted in Uncategorized

Latest Updates