వరంగల్ లో గోరింటాకు ఫెస్టివల్


ఆషాడమాసం అంటే గుర్తుకు వచ్చేంది గోరింటాకు. ఈ నెలలో ఏ ఇంట్లో చూసినా… గోరింటాకు సందడి కనిపిస్తుంది. గోరింటాకును తీసుకొచ్చి దంచి చేతులకు పెట్టుకుంటున్నారు మహిళలు. వరంగల్ లో గోరింటాకు పండుగ చేసుకుంటున్నారు మహిళలు. గోరింటాకు వేడుకలను అక్కడి మహిళలు, యువతులు ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈసారి అందరూ ఒకచోటకు చేరి… మైదాకును చేతులు, కాళ్లకు పెట్టుకొని మురిసిపోయారు.  గోరింటాకు పెట్టుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయమని… ఇందులో అనేక ఔషద గుణాలు ఉన్నాయంటున్నారు మహిళలు. గోరింటాకు ఎర్రగా పండాలని కోరుకునే సెంటింమెంటూ చాలా ఇళ్లలో ఉంది.

Posted in Uncategorized

Latest Updates