వరంగల్ లో జరిగిన దారుణం : అది గుత్తొంకాయ కాదు.. చిట్టెలుక

v6-fb-(3)ఓరి దేవుడా.. మధ్యాహ్నం అయ్యింది.. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అంటే.. నిజంగా ఎలుకలు పరిగెత్తవు.. ఆకలి అవుతుంది అని సంకేతం. ఊరికానీ ఊరు అయితే హోటల్ కి వెళ్లి భోజనం చేస్తాం. అలా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ సుబేదారిలోని ఓ టిఫిన్ సెంటర్ కు వెళ్లాడు. మీల్స్ ఆర్డర్ చేశాడు ఓ వ్యక్తి. కూరల్లో గుత్తి వంకాయ కూడా ఉంది. నిగనిగలాడుతూ.. ఘుమఘుమలాడుతోంది. ఆవురావురు అంటూ ఓ వంకాయను నోట్లో పెట్టుకున్నాడు.. అంతే షాక్ అయ్యాడు.. అది గుత్తొంకాయ కాదు.. ఎలుక.. చిన్న చిట్టెలుక. ఇంకేమైనా ఉందా.. ఒళ్లు వణికింది.. గుండె దడ పెరిగింది.. ఆ ఎలుకను అలాగే పట్టుకుని హోటల్ నిర్వాహకులకు చూపించాడు.. బయటకు వచ్చాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే…వరంగల్‌ కి చెందిన రమేశ్‌ భార్య హన్మకొండ సుబేదారిలోని రోహిణి ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. తాను భోజనం చేసి తన భార్య చంద్రకళకు కూడా ఏదోఒకటి పార్శిల్‌ తీసుకెళ్లేందుకు హోటల్‌ కు వచ్చాడు. అయితే, తన భార్యకు భోజనం ఆర్డర్‌ చేసి తాను భోజనం చేస్తున్న క్రమంలో ఆలూ వంకాయ కూరలో ఎలుక ప్రత్యక్షమైంది. వంకాయ ముక్క అని భావించి నోట్లో పెట్టుకున్న క్రమంలో ఎలుకను గుర్తించాడు. ఈ క్రమంలో ఆయన కొద్దిపాటి అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. అనంతరం హోటల్‌ యాజమాన్యం నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వరంగల్ అర్బన్ జిల్లా, హన్మకొండ సుబేదారి లోని అక్షయ టిఫిన్ సెంటర్ లో, ఓ వ్యక్తి టిఫిన్ చేస్తుండగా కర్రీలో చనిపోయిన ఎలుక పిల్ల రావడంతో హోటల్ లోని అందరు నిర్గాంత పోయారు…

Gbn న్యూస్ తెలుగు 发布于 2018年6月12日周二

Posted in Uncategorized

Latest Updates