వరంగల్ లో దారుణం : వ్యాపార దంపతుల హత్య

Elderly-Couple-Found-Brutally-Murdered-In-Hasanparthyవరంగల్ అర్బన్ జిల్లాలోని హసన్ పర్తిలో వృద్ద దంపతుల దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని దుండగులు దంపతులను గొంతుకోసం హత్య చేశారు. మృతులు గడ్డం దామోదర్, పద్మలుగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యలపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. మృతులకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నాడు. ఘటనా స్థలానికి సీపీ రవీందర్ చేరుకుని కేసు విచారిస్తున్నారు.

వీరిది కిరాణా దుకాణం. ఇంటి ముందు షాపు ఉంటే.. లోపల ఇల్లు. ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు షాపు తెరుస్తారు. జూన్ 19వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటలు అయినా ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాలేదు. దీంతో పక్కనే ఉన్న హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. ఇంట్లోకి వెళ్లి చూడగా షాక్ అయ్యారు. దంపతులు ఇద్దరూ చనిపోయి ఉన్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లోని బెడ్ రూపంలో భర్త దామోదర్ను గొంతుకోసి చంపగా.. బాత్ రూంలో భార్య పద్మను కిరాతకంగా చంపి పడేశారు. ఇంట్లోని డబ్బు, బంగారం కూడా దొంగతనం అయినట్లు గుర్తించారు పోలీసులు. దోపిడీ దొంగల పనే అని అనుమానిస్తున్నారు. స్థానికులతో ఎంతో కలుపుగోలుగా, సన్నిహితంగా ఉండే ఈ వ్యాపార దంపతులు హత్యకు గురయ్యారనే వార్త హసన్ పర్తిలో కలకలం రేపింది. నిందితులను పట్టుకోవటానికి ప్రత్యేక పోలీస్ బృందాలను నియమించినట్లు వెల్లడించారు సీపీ రవీందర్.

Posted in Uncategorized

Latest Updates