వరంగల్ లో భారీ అగ్నిప్రమాదం : గోదాంలో పేలుళ్లు.. సజీవ దహనం

fire-accidentవరంగల్ పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రముఖ భద్రకాళి ఫైర్ వర్క్స్ కంపెనీ గోదాంలో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ మంటలు వ్యాపించాయి. పెద్ద మొత్తంలో దీపావళి టపాసులు నిల్వ ఉండటంతో నిమిషాల్లోనే గోదాం మొత్తం మంటలు వ్యాపించాయి. పెద్ద పెద్ద శబ్దాలతో గోదాం నేల మట్టం అయ్యింది. ఫైర్ వర్క్ గోదాంలో పని చేస్తున్న వారిలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. మరో నలుగురు వ్యక్తులు కూడా మంటల్లో చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. తీవ్ర గాయాలతో ఉన్న ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదంలో ఫైర్ వర్క్స్ గోదాం మొత్తం కాలి బూడిద అయ్యింది. రోజువారీగానే ఉదయం పనికి వెళ్లారు కూలీలు. షార్ట్ సర్క్యూట్ వల్ల గోదాంలో మంటలు వచ్చాయి. ఫైర్ వర్క్స్ కావటంతో వెంటనే అదుపు చేయటం సాధ్యం కాలేదు. ఫైరింజన్లు వచ్చే సమయానికే భారీ నష్టం వాటిల్లింది. గోదాం మొత్తం తగలబడిపోయింది. ఎంత మంది చనిపోయారు.. ఎంత మంది గాయపడ్డారు.. ఎంత మంది పని చేస్తున్నారు.. అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది.

Posted in Uncategorized

Latest Updates