వరంగల్ లో రఘునాథాచార్య స్వామి మృతి.. సీఎం సంతాపం

వరంగల్ అర్బన్ :  ప్రముఖ సంస్కృత పండితులు, వేదాంత కేసరి, కవిశాబ్ధిక కేసరి, మహామహోపాధ్యాయ రఘునాథాచార్య స్వామి తుదిశ్వాస విడిచారు. వారి మరణం ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన శ్రీ వైష్ణవ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ జీయర్ స్వాములతో పాటు ఎందరో శిష్యులను మహోన్నతులుగా తీర్చిదిద్దిన ఆచార్యుల వారు..  సత్సంప్రదాయ పరిరక్షణకు అహర్నిశలూ కృషిచేశారని అన్నారు. ఆ జన్మాంతం తన ప్రవచన పరంపరతో ప్రతీ ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన కల్పించిన మహామనీషి రఘునాథాచార్య స్వామి అని చెప్పారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి  తెలియజేస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు.

Posted in Uncategorized

Latest Updates