వరంగల్ లో రూ.3.59 కోట్లు సీజ్ చేసిన పోలీసులు

పోలింగ్ కు కొద్ది గంటల ముందు.. వరంగల్ జిల్లా కాజీపేటలో భారీ స్థాయిలో నగదు పట్టుబడింది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు.. పంపిణీ చేసేందుకు ఆక్రమంగా నిల్వవుంచిన 3 కోట్ల 59 లక్షల 19వేల 250 రూపాయల నగదును వరంగల్‌ కమిషనరేట్‌  పోలీసులు పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు హైదరాబాద్‌ ఉప్పల్‌ ప్రాంతానికి చెందిన కొమ్మ ఫాతిమా రెడ్డి అలియాస్‌ ఫ్రాన్సిస్ రెడ్డిని అరెస్ట్ చేశారు.

కాజీపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఫ్రాన్సిస్ రెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని ప్రశ్నించిన పోలీసులు.. అతడి వద్ద ఉన్న కవర్‌తో పాటు, రూ.2 లక్షల నగదును సీజ్ చేశారు. ఓటర్లకు పంచేందుకు రూ.3.59కోట్లు సిద్దం చేశామని.. కాంగ్రెస్‌ నాయకుడు అమృతరావు ఇంటికి ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో ఉంచినట్లు చెప్పాడు. ఒక్కో బండిల్ లో రూ.2లక్షలు ఉంచి.. ఈజీగా పంపిణీ చేసేందుకు ప్యాక్ చేశారు. ఆ బండిల్ పై… గ్రామం, ఎవరికివ్వాలో వాళ్ల పేర్లు రాశారు. ఆ ఇంట్లో తనిఖీ చేసినప్పుడు.. డబ్బుతో పాటు… కూటమి అభ్యర్థి దేవయ్య… ఇటీవల ఓ ప్రచార బహిరంగ సభకోసం చేసుకున్న అప్లికేషన్ ఫామ్ కూడా పోలీసులకు దొరికింది. భారీ మొత్తం ఓటర్లకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా  వున్న డబ్బును గుర్తించడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్‌ జోన్‌ డి.సి.పి బి.వెంకట్‌ రెడ్డి, కాజీపేట్‌ ఏ.సి.పి నర్సింగరావు, టాస్క్‌ఫోర్‌ ఏ.సి.పి చక్రవర్తి, టాస్క్‌ఫోర్స్‌ ఇన్స్‌స్పెక్టర్‌ రమెష్‌కుమార్‌, కాజీపేట్‌ ఇన్స్‌స్పెక్టర్‌ అజయ్‌ కాజీపేట ఎస్‌.ఐ దేవేందర్‌తో పాటు కానిస్టేబుళ్ళు వెంకన్న, సదానందం, రవిలను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా. వి.రవీందర్‌ అభినందించారు.

 

Posted in Uncategorized

Latest Updates