వరంగల్ MGMలో అగ్నిప్రమాదం

వరంగల్‌ : MGM హస్పిటల్ లో ఇవాళ (సెప్టెంబర్-27) ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. చిల్డ్రెన్ వార్డులో షార్ట్‌ సర్క్యుట్‌ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది హస్పిటల్ అద్దాలు పగలగొట్టారు. సిబ్బంది, తల్లిదండ్రుల సాయంతో చిన్నపిల్లలను బయటకు తీసుకొచ్చారు. ఒక్కసారిగి ఆస్పత్రి మొత్తం పొగతో నిండిపోవడంతో.. పేషెంట్స్ భయాందోళనకు గురయ్యారు.

సిబ్బందితో సహా ఆస్పత్రిలోని అన్ని వార్డులోన్ని రోగులు అందరూ  భయటకు పరుగు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు.  ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Posted in Uncategorized

Latest Updates