వరద ముంపులో మహారాష్ట్ర..నలుగురిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్


మహారాష్ట్రను వరదలు ముంచెత్తుతున్నాయి. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. నవీ ముంబయిలో నలుగురి ప్రాణాలను కాపాడారు రెస్క్యూ సిబ్బంది. తలోజా ప్రాంతంలో ఓ కారు నదిలో పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు కుటుంబసభ్యులు భయంతో పైకి ఎక్కి కూర్చున్నారు. వారి అరుపులు విన్న స్థానికులు రక్షించేందుకు ప్రయత్నించారు. తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వటంతో… ఎన్డీఆర్ఎఫ్ దళాలు అక్కడికి చేరుకుని వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. భారీ వర్షాలకు ముంబై నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

Posted in Uncategorized

Latest Updates