వరల్డ్ నెంబర్ వన్: మళ్లీ ఫెదరరే

FEDERERస్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్ ఫెద‌రర్‌ ఈ ఏడాది రెండోసారి ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకోనున్నాడు. మెర్సిడెస్‌ ఓపెన్‌ టోర్నీలో ఫెద‌రర్‌ ఫైనల్‌కు చేరుకోవడంతో అతనికి నంబర్ వన్‌ ర్యాంక్‌ ఖాయమైంది. సోమవారం(జూన్-18) విడుదల చేసే తాజా ర్యాంకింగ్స్‌లో ఫెదరర్‌ అధికారికంగా నంబర్‌వన్‌ ర్యాంక్‌ను దక్కించుకోనున్నాడు.

2012 తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో టాప్‌ ర్యాంక్‌ అందుకున్న ఫెద‌రర్‌… మే 14న స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌కు ఈ స్థానాన్ని కోల్పోయాడు. శనివారం(జూన్-16) జరిగిన సెమీఫైనల్లో ఫెదరర్‌ 6–7, 6–2, 7–6 తో నిక్‌ కిరియోస్‌ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు.  ఆదివారం(జూన్-17) జరిగే ఫైనల్లో మిలోస్‌ రావ్‌నిచ్‌ (కెనడా)తో ఫెదరర్‌ తలపడతాడు.

 

Posted in Uncategorized

Latest Updates