వరల్డ్ పోకర్ సిరీస్: రూ.60 కోట్లు కైవసం చేసుకున్న విజేత

ప్రపంచ పోకర్ సిరీస్ విజేతగా ఇండియానాకు చెందిన 33 ఏళ్ల జాన్ సిస్ నిలిచాడు.  ఇందులో విక్టరీ సాధించి 60 కోట్ల రూపాయాలను దక్కించుకున్నాడు. లాస్ వెగాస్ లో ఘనంగా నిర్వహించిన పోకర్ సిరీస్ లో  ప్లోరిడాకు చెందిన 32 ఏళ్ల టోనో మైల్స్ పై విజయాన్ని సాధించాడు జాన్. శనివారం(జులై-14) అర్ధరాత్రి నుంచి ఆదివారం(జూలై-15) ఉదయం వరకు సాగిన పోకర్ లో జాన్ సిన్ రూ.60 కోట్లు కైవసం చేసుకున్నాడు. ఇందులో ఓడిపోయిన టోని రూ.34 కోట్లతో సరిపెట్టుకున్నాడు. మూడో స్థానంలో నిలిచిన మైకేల్ డయల్ రూ.25 కోట్లు దక్కించుకున్నాడు. ఈ వరల్డ్ పోకర్ సిరీస్ లో 7వేల 874 మంది సభ్యత్య రుసుముగా మొత్తం 539 కోట్ల రూపాయలు చెల్లించారు.

Posted in Uncategorized

Latest Updates