వరల్డ్ ఫేవరెట్ ఎందుకిలా! : ఫిఫా వరల్డ్ కప్ లో అర్జెంటీనాకు షాక్

aerఫిఫా ప్రపంచకప్ లో ఫేవరెట్ జట్లలో ఒకటైన అర్జెంటీనాకు క్రొయేషియా గట్టి షాక్ ఇచ్చింది. గ్రూప్ డిలో భాగంగా క్రొయేషియాతో జరిగిన మ్యాచ్ లో అర్జెంటీనా చిత్తుగా ఓడిపోయింది. క్రొయేషియాకు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన మెస్సీ అండ్ గ్యాంగ్ …. 0-3తో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. క్రొయేషియా ఆటగాళ్లు పోటీ పడి గోల్స్ చేస్తుంటే ..మెస్సీ గ్యాంగ్ ఒక్క గోల్ కూడా చేయలేదు. అర్జెంటినా స్టార్ ఆటగాడు మెస్సీ ..ఈ మ్యాచ్ లో తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ ఓటమితో అర్జెంటీనా నాకౌట్ ఆశలకు గండిపడ్డాయి.

రెండు జట్లు ఫస్టాఫ్ లో గోల్స్ చేయలేదు. సెకండాఫ్ లో క్రోయేషియా రఫ్ ఆడించింది. ఎనిమిది నిమిషాలకే అంటీ రెబిక్ క్రొయేషియాకు తొలి గోల్ ను అందించాడు. 80వ నిమిషంలో క్రొయెషియా మరో ఆటగాడు లుకా మాడ్రిక్ అద్భుత గోల్ తో…క్రోయేషియా 2-0 ఆధిక్యంలోకి వచ్చింది. అర్జెంటీనా ఆటగాళ్లు పదేపదే గోల్ పోస్ట్ పై దాడి చేసినా క్రొయేషియా రక్షణ శ్రేణిని ఛేదించలేకపోయారు. ఎక్స్ ట్రా ఇంజూరి టైమ్ లో ఇవాన్ రాకిటిక్ క్రొయేషియాకు మూడో గోల్ అందించాడు.

Posted in Uncategorized

Latest Updates