వరల్డ్ బ్యాడ్మింటన్ : ప్రణయ్ శుభారంభం

 ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌ లో భారత ఆటగాడు HS ప్రణయ్‌ శుభారంభం చేశాడు. సోమవారం (జూలై-30) జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ పోరులో ప్రపంచ 11వ ర్యాంక్‌ ఆటగాడు ప్రణయ్‌ 21-12, 21-11 తేడాతో అభినవ్‌ మనోతా(న్యూజిలాండ్‌)పై గెలిచి రెండో రౌండ్‌లోకి ప‍్రవేశించాడు. తొలి గేమ్‌ ను సునాయాసంగా గెలిచిన ప్రణయ్‌.. రెండో గేమ్‌ లోనూ అదే ఆటను పునరావృతం చేసి మ్యాచ్‌ లో విజయం సాధించాడు.

ఇక పురుషుల డబుల్స్‌ పోరులో మనూ అత్రి- సుమీత్‌ రెడ్ది జోడి 21-13, 21-18 తేడాతో  నికోలోవ్‌-రుసెవ్‌ జంటపై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. తొలి గేమ్‌లో పెద్దగా పోరాడకుండానే గెలిచిన మనూ అత్రి ద్వయం.. రెండో గేమ్‌ లో మాత్రం శ్రమించి విజయం సాధించింది.

Posted in Uncategorized

Latest Updates