వరల్డ్ బ్యాడ్మింటన్ : సైనా విక్టరీ

స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ విజయాలతో దూసుకెళ్తోంది. చైనాలో జరుగుతున్న వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌ షిప్‌ లో సత్తా చాటుతోంది. గురువారం (ఆగస్టు-2) జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ లో థాయ్‌ లాండ్‌ కు చెందిన నాలుగో సీడ్ రత్‌ చనోక్ ఇంతనోన్‌ పై వరుస గేమ్స్‌ లో గెలిచి క్వార్టర్స్‌ లో అడుగుపెట్టింది. 47 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌ లో సైనా 21-16, 21-19 తేడాతో విజయం సాధించింది. తొలి గేమ్‌ ను ఈజీగా సొంతం చేసుకున్న సైనాకు రెండో గేమ్‌ లో ప్రతిఘటన ఎదురైంది. మొదట్లోనే సైనా 4-1 లీడ్‌లోకి దూసుకెళ్లినా.. తర్వాత పుంజుకున్న ఇంతనోన్ స్కోరును 19-19 దగ్గర సమం చేసింది. ఈ దశలో వరుసగా రెండు పాయింట్లు సాధించిన సైనా.. గేమ్‌ తో పాటు మ్యాచ్‌ ను గెలిచింది. ఇప్పటికే ప్రిక్వార్టర్స్‌ లో అడుగుపెట్టిన కిదాంబి శ్రీకాంత్, పీవీ సింధు క్వార్టర్స్ బెర్త్ కోసం తలపడనున్నారు.

Posted in Uncategorized

Latest Updates