వరల్డ్ రికార్డు: ఇంగ్లండ్ స్కోరు-481/6

match
ఇంగ్లాండ్ వన్డే టీమ్ మరోసారి రెచ్చిపోయింది. తన రికార్డును తానే తిరగరాసింది. 50 ఓవర్లలో అత్యధిక స్కోరు నమోదు చేసింది. ఆస్ట్రేలియాతో  5 వన్డేల సిరీస్ లో భాగంగా నిన్న(మంగళవారం,జూన్-19) జరిగిన మూడో వన్డేలో మోర్గాన్  సేన 6 వికెట్లు కోల్పోయి ఏకంగా 481 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. 2016లో మోర్గాన్  నేతృత్వంలోని ఇంగ్లాండ్  జట్టే పాకిస్థాన్ పై 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 444 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఆ స్కోరు కంటే ఇప్పుడు 37 పరుగులు ఎక్కువే చేసింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లలో అలెక్స్  హేల్స్  147, ఓపెనర్  జానీ బెయిర్ స్టో 139, మరో ఓపెనర్  జేసన్  రాయ్  82 రన్స్ చేశాడు. 482 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కేవలం 239 రన్స్ మాత్రమే చేసింది. దీంతో 242 పరుగుల తేడాతో ఆసీస్ పై ఇంగ్లండ్ భారీ విజయం సాధించింది.

ఇంగ్లండ్ బౌలర్లలో అలీకి మూడు, రషీద్ కు 4 వికెట్లు దక్కాయి.

 

 

Posted in Uncategorized

Latest Updates