వరల్డ్ రికార్డ్ బ్రేక్ : కోట్లు కొల్లగొట్టిన మన దేశ పేయింటింగ్

ARTS CRORESమన దేశ పేయింటింగ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఇండియాకి చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు తయ్యబ్ మెహతా కుంచె గీసిన కాళీ అనే చిత్రపటం అత్యధిక మొత్తానికి వేలంలో అమ్ముడుపోయి రికార్డులను తిరగరాసింది. శుక్రవారం (జూన్-15) ఢిల్లీలో సాఫ్రాన్ ఆర్ట్స్ నిర్వహించిన వేలంలో తయ్యబ్ మెహతా చిత్రాన్ని ఓ అభిమాని రూ.26.4 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నాడు. దీనికి రూ.19.8 కోట్లు వస్తాయని అంచనాలు వేయగా.. అంతకుమించిన ధరకు అమ్ముడుపోయింది. తయ్యబ్ మెహతా గీసిన వుమెన్ ఇన్ రిక్షా అనే టైటిల్‌తో ఉన్న చిత్రాన్ని 2017లో వేలానికి పెట్టగా అనూహ్యంగా రూ.22.99 కోట్లకు ఓ అభిమాని దక్కించుకున్నాడు. ఈ రికార్డును కొత్త చిత్రం అధిగమించడం పట్ల సాఫ్రాన్‌ ఆర్ట్స్ సంస్థ CEO దినేశ్ వాజిరాని హర్షం వ్యక్తంచేశారు. తయ్యబ్ మెహతా చిత్రం అత్యధిక ధరకు అమ్ముడుపోవడం భారతీయ ఆధునిక చిత్రకళలో మైలురాయిగా నిలిచిపోనున్నదని తెలిపారు దినేశ్.

Posted in Uncategorized

Latest Updates