వరల్డ్ రికార్డ్ లో మన దేశ అమ్మాయి : పొడవైన జుట్టు..తెచ్చిపెట్టింది కీర్తి


గుజరాత్ : వెంట్రుకలు పెంచుకోవాలంటే మహాళలకు మహా సరదా. పొడువుగా జడ ఉండేలా పోటీ పడుతుంటారు. చిన్నప్పట్నుంచీ ఎంతో ఇష్టంగా ఎక్కువ జుట్టును పెంచుకున్న మన దేశ అమ్మాయి వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టున్న టీనేజీ అమ్మాయిగా నీలాంశీ పటేల్‌ (16) చరిత్ర సృష్టించింది. ఈమె జుట్టు పొడవు 5.7 అడుగులు ఉన్నట్లు తెలిపారు గిన్నిస్‌ ప్రతినిధులు. ఈ రికార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది నీలాంశీ. 6 సంవత్సరాల వయసు నుంచీ ఎప్పుడూ కురులను కత్తిరించుకోలేదని, వారానికి ఒకసారి మాత్రమే తలకు స్నానం చేస్తానని తెలిపింది నీలాంశీ. వరల్డ్ రికార్డు నెలకొల్పిన నీలాంశీ పటేల్ గుజరాత్‌ లోని మహెసాణా నివాసి.

Posted in Uncategorized

Latest Updates