వరల్డ్ హైపర్ టెన్షన్ డే : మనకు కోపం చాలా ఎక్కువ

hyper tention day

చీటికీ మాటికీ కోపం వస్తుందా.. చిన్న విషయాలకే టెన్షన్ పడుతున్నారా.. ప్రతి విషయంలో విపరీతమైన ఆలోచనతో హైటెన్షన్ గురవుతున్నారా.. బయటకు కనిపించని ఆందోళన గుండెలను పిండి చేస్తుందా.. బుర్రను బద్దలు కొడుతుందా.. ఇవన్నీ మేం అంటున్నవి కాదు.. దేశవ్యాప్తంగా హైటెన్షన్ పడుతున్న ప్రజల్లో.. తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. అందులోనూ మెదక్ జిల్లా ఫస్ట్ ప్లేస్ లో ఉంటే.. హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. ఇది దేశంలోని రాష్ట్రాల లెక్క అయితే.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే హైటెన్షన్ లో ఇండియా నెంబర్ వన్ లో నిలిచింది.

జాతీయ పోషకాహార సంస్థ రిపోర్ట్ ప్రకారం తెలంగాణలో 39 శాతం మంది పురుషులు, 29 శాతం మంది మహిళలు హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నారు. ఇందులో మెదక్‌ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి హైదరాబాద్‌ ఉంది. పని, ఒత్తిడి, మద్యపానంతో బీపీ పెరుగుతుందని తెలిపింది. చాలా మందికి తమకు అధిక రక్త పోటు ఉన్నట్లు కూడా తెలియదు. తీరా తెలిసే సమయానికి కోలుకోలేని నష్టం వాటిల్లుతోంది.

ఈ హైటెన్షన్ గుండె, కిడ్నీ, మెదడు పనితీరును దెబ్బతీస్తోంది. సైలెంట్‌ కిల్లర్‌గా మారుతోంది. కూర్చున్న దగ్గరకే అన్ని పనులు కావాలనుకుంటున్నాడు. శరీరం బద్దకంగా తయారవుతుందని సర్వే స్పష్టం చేస్తోంది. శరీరంలో రక్త ప్రసరణలో తేడా, సరైన రీతిలో రక్తం సర్య్కులేషన్ జరగకపోవడంతో హైపర్ టెన్షన్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుత జనరేషన్ లో టెక్నాలజీ ప్రభావం కూడా కారణం అవుతుంది. ఎక్కువసేపు కూర్చుని పనులు చేయటం కూడా హైటెన్షన్ కు గురవుతున్నారు. పదేళ్ల ముందు వరకు వృద్ధుల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మాత్రం 30 ఏళ్లకే హైటెన్షన్ వచ్చేస్తుందని చెబుతున్నాయి సర్వేలు. హైపర్ టెన్షన్ రాకుండా ఉండేందుకు వ్యాయామం, మెట్లు ఎక్కడం, వీలైనంత నడక మంచిదని సూచిస్తున్నారు వైద్యులు.

Posted in Uncategorized

Latest Updates