వరుసగా మూడో రోజు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

కొన్ని రోజులుగా సామాన్యుడికి చుక్కలు చూపిస్తూ పెరిగిన ఆయిల్ ధరలు మూడు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. దసరా రోజు నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు దిగి వస్తున్నాయి. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ పై 41 పైసలు, డీజిల్ పై 13 పైసలు తగ్గింది. దీంతో హైదరాబాద్ లో  లీటరు పెట్రోల్ ధర రూ.86.92 ఉండగా, లీటరు డీజిల్ ధర రూ.81.97గా ఉంది. ఢిల్లీలో పెట్రోల్‌ పై 39పైసలు, డీజిల్‌ పై 12 పైసలు తగ్గింది. దీంతో అక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.81.99గా , లీటర్‌ డీజిల్‌ ధర రూ.75.36గా ఉంది. ముంబైలో నిన్నటితో పోలిస్తే లీటర్‌ పెట్రోల్‌ ధర 38 పైసలు తగ్గి రూ.87.46కు చేరింది. లీటర్‌ డీజిల్‌ ధర 13పైసలు తగ్గి రూ.79గా కొనసాగుతోంది. ఆయిల్ ధరలు తగ్గివస్తుండటంపై వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పైసల్లో తగ్గితే సరిపోదు రూపాయల్లో తగ్గుదల ఉండాలని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates