వర్మగా వస్తున్న తమిళ్ “అర్జున్ రెడ్డి”.. టీజర్ రిలీజ్

చిన్నసినిమాగా రిలీజై టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమా ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. గాఢమైన ప్రేమ కథతో రూపొందిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీని తమిళంతో పాటు హిందీలోనూ రీమేక్ చేస్తున్నారు.  అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్  ను “వర్మ’’ టైటిల్ తో రూపొందిస్తున్నారు. ఈ మూవీలో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా యాక్ట్ చేస్తున్నాడు.  ఇవాళ(సెప్టెంబర్.23) ధృవ్ బర్త్ డే సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

తమిళ అర్జున్ రెడ్డిలో హీరోయిన్ గా మేఘ నటిస్తోంది. తెలుగులో కంటే… తమిళ వెర్షన్ లో హీరోయిన్ ను హాట్ గా చూపిస్తున్నారు. తెలుగు వెర్షన్ కు మ్యూజిక్ ఇచ్చిన రాధన్ … “వర్మ”కు కూడా సంగీతం అందిస్తున్నారు. సహజ ప్రేమ కథలను తీయడంలో తన మార్క్ చూపించే డైరెక్టర్ బాల ఈ మూవీని తమిళంలో రూపొందిస్తున్నాడు.

Posted in Uncategorized

Latest Updates