వర్మ ట్విట్ : ఆఫీసర్ వాయిదా

NAGఅక్కినేని నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆఫీసర్ మే25న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయిత ఈ మూవీని అనివార్యకారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు తెలిపింది సినిమా యూనిట్. ఈ విషయాన్ని డైరెక్టర్ వర్మ ట్విట్టర్ ద్వారా తెలుపుతూ..ఈ సినిమాను మే 25న విడుదల చేయాలని ముందుగా నిర్ణయించాము. అయితే అనివార్య కారణాల వల్ల జూన్ 1కి వాయిదా వేసినట్లు ట్విట్ చేశారు వర్మ. ఆఫీసర్ సినిమాను సాంకేతికంగా బాగా రూపొందించి ..ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలనుకుంటున్నామని.. ఈ క్రమంలోనే సినిమాకు సాంకేతిక హంగులు జోడించేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందన్నారు. అందుకే ఆఫీసరర్ ను మే 25 నుంచి జూన్ 1కి వాయిదా వేస్తున్నట్లు బుధవారం (మే-16) ట్వీటర్‌ లో వెల్లడించారు వర్మ. ముంబై మాఫియా ఆధారంగా తెరకెక్కిన ఆఫీసర్ లో నాగ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. మైరా సరీన్ హీరోయిన్‌ గా పరిచయం అవుతోంది.

Posted in Uncategorized

Latest Updates