వర్మ పాలిటిక్స్ : పవన్ పైకి శ్రీరెడ్డిని వదిలింది నేనే

RGVజనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను శ్రీరెడ్డి తీవ్రస్ధాయిలో విమర్శించడం వెనుక ఉన్నది తానేనన్నారు డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఈమేరకు యూట్యూబ్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. పెద్దవాళ్లను విమర్శిస్తేనే అందరి దృష్టి పడుతుందని తాను శ్రీరెడ్డికి సూచించానని ఆ వీడియోలో వర్మ తెలిపాడు. కత్తి మహేష్ కూడా పవన్ ను విమర్శించే పాపులర్ అయ్యాడని శ్రీరెడ్డికి తాను చెప్పానన్నారు. తాను చెప్పినట్లే శ్రీరెడ్డి పవన్ ను టార్గెట్ చేసిందని వర్మ తెలిపాడు. దీనికి సంబంధించి పూర్తి బాధ్యత తనదేనని తెలిపాడు. శ్రీరెడ్డిని ప్రభావితం చేసినందుకు పవన్ కళ్యాణ్, అతని అభిమానులకు వర్మ క్షమాపణలు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates