వర్మ మరో బంపర్ ఆఫర్.. ఈ సారి సీనియర్ ఎన్టీఆర్ కావాలట

డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరో బంపర్ ఆఫర్ ప్రకటించాడు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్ సినిమాను డైరెక్ట్ చేస్తున్న వర్మ రీసెంట్ గా అచ్చం చంద్రబాబులా  ఉన్న వ్యక్తి వీడియో వైరల్ కావడంతో అతడి ఆచూకీ చెప్పిన వారికి రూ.లక్ష‌ ఇస్తానని ప్రకటించాడు. వర్మ ఇలా ప్రకటించాడో లేదో రెండు రోజుల్లో ఓ ప్రైవేట్ ఛానల్ రిపోర్టర్ ఆ వ్యక్తి ఆచూకీ కనుక్కొని వర్మకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు.

అయితే ఇప్పుడు వర్మ ఫోకస్ సీనియర్ ఎన్టీఆర్ పై పడింది.  ”ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ కోసం ముగ్గుర్ని షార్ట్ లిస్ట్ చేశానని, కానీ తనకు ఇంకా బెటర్ యాక్టర్ కావాలంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.  లక్ష్మీపార్వతిని కలిసినప్పుడు ఎన్టీఆర్‌ ఏ వయసులో ఉన్నారో, అప్పుడు ఎలా కనిపించేవారో.. అలాంటి యాక్టరే కావాలి. ఆయనలా ఉండే, మాట్లాడే వ్యక్తి కనపడితే వీడియోను laksmisntr@gmail.comకు పంపండి. వారికి రూ.10 లక్షలు బహుమతి ఇస్తానని ఓపెన్‌గా ఆఫర్‌ చేస్తున్నా’’ అని తెలిపాడు.

Posted in Uncategorized

Latest Updates