వర్మ వేదన : జీర్ణించుకోలేకపోతున్నా.. అబద్ధం అని చెప్పండి

varmaశ్రీదేవిని దేవ‌త‌గా ఆరాధించే రామ్ గోపాల్ వ‌ర్మ‌, ఆమె లేర‌నే వార్త‌ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. దేవుణ్ణి ఎప్పుడు ఇంత‌లా ద్వేషించ‌లేదన్నారు. కాంతికన్నా ఎక్కువ ప్రకాశవంతమైనది.. నేడు మనకు దూరమైంది.. లోకం విడిచిపోయిన శ్రీదేవి అంటే తనకు చాలా కోపం వస్తుంది.. శ్రీదేవి ఏ లోకంలో ఉన్నా.. ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను అంటూ తన ఆరాధ్య దేవతకు నివాళులు అర్పించారు. ఆమె భర్త బోనీ కపూర్ గురించి ఆలోచిస్తేనే చాలా ఆవేదనగా ఉందని, శ్రీదేవి నిజంగానే చనిపోయిందా? ఎవరైనా నన్ను నిద్రలేపి.. ఇదొక పీడకల మాత్రమే అని చెప్పగలరా? అంటూ శ్రీదేవి మరణంపై తన భాధను రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్ చేశారు.

అస‌లు అందరినీ ఇలా వదిలేసి ఆమె ఒంటరిగా ఇలా ఎలా వెళ్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నేను మిమ్మల్ని ఇంతగా నవ్వించిన తర్వాత కూడా.. మీరు నన్ను ఇంతగా ఏడిపించడం కరెక్టా? అంటూ గతంలో శ్రీదేవితో కలసి ఓ ప్రోగ్రామ్ లో పాల్గొన్న వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు రామ్ గోపాల్ వర్మ.

ఈ సారి ఆ దేవుడే ఒక జామురాతిరి ఆ జాబిలమ్మకు శాశ్వతంగా జోలపాడాడు.. తన జాజి కొమ్మను ఎక్కువకాలం భూలోకంలో ఉంచలేక శాశ్వతంగా తన దరికి చేర్చుకున్నాడంటూ శ్రీదేవి ఫోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

https://www.facebook.com/notes/rgv/i-hate-god-for-killing-sridevi-and-i-hate-sridevi-for-dying/935574113267321/

Posted in Uncategorized

Latest Updates