వర్శిటీ ర్యాంకింగ్స్‌: బెంగళూరు టాప్‌

ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమ వర్శిటీల్లో ఇండియాకు చెందిన 49 వర్శిటీలు స్థానం దక్కించుకున్నాయి. భారత్‌ కు చెందిన వర్శిటీల్లో ఎప్పటిలాగే బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(IISC) మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత IIT ఇండోర్‌,IIT బాంబే,IIT రూర్కీ, జగద్గురు శ్రీ శివరాత్రీశ్వర యూనివర్శిటీలు టాప్‌ 5లో నిలిచాయి.

2018 సంవత్సరానికి గానూ ‘టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్ వరల్డ్‌ యూనివర్శిటీ ర్యాంకింగ్స్‌’ విడుదలయ్యాయి. ఈ  లిస్టులోవరుసగా మూడో ఏడాది ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీ 2, స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ మూడో స్థానం దక్కించుకున్నాయి. మొత్తంగా 1,200లకు పైగా యూనివర్శిటీలతో లిస్టు తయారూ చేయగా.. భారత్‌ నుంచి 49 యూనివర్శిటీలు చోటు దక్కించుకున్నాయి.

ఈ జాబితాలో 251వ ర్యాంక్‌తో IISC బెంగళూరు భారత యూనివర్శిటీల్లో టాప్‌లో ఉంది.

Posted in Uncategorized

Latest Updates