వర్షపు నీటితో కరెంటు ఉత్పత్తి : తొమ్మిదో తరగతి అమ్మాయి ఘనత

నీటితో కరెంటు ఉత్పత్తి అవుతుందనే విసయం అందరికీ తెలిసిందే. దీంతోపాటు వ్యర్థ పదార్థాలు, గాలి, బొగ్గు, పేడతో కరెంటును తయారు చేయవచ్చు.  అయితే వర్షపు నీటితోనూ కరెంటును పుట్టించి, అందరిచేత ప్రశంసలు అందుకుంటోంది ఓ 15 సంవత్సరాల అమ్మాయి.  వర్షపు నీటితో కరెంట్ పుట్టించే ఒక పరికరాన్ని కనిపెట్టింది రేహాన్ జమలోవా అనే అమ్మాయి.  అజేర్‌బాయిజన్‌ కి చెందిన ఈ 15 యేండ్ల అమ్మాయి తక్కువ ఖర్చుతో చేసిన పరికరంపై పేటెంట్ కూడా సంపాదించింది. ముంబైలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నదన్న విషయం అందరికీ తెలుసు. దీనివల్ల ఎన్నో లక్షల లీటర్ల నీళ్లు వృథాగా రోడ్డు పాలవుతున్నది. అయితే అదే నీళ్లని ఒడిసిపడితే కరెంట్ పుట్టించవచ్చని తెలిపింది రేహన్. ఆమె తయారు చేసిన దానికి రేనెర్జి అని పేరు పెట్టుకున్నది. 9వ తరగతి చదువుతున్న అమ్మాయికి ఒకరోజు గాలి నుంచి విద్యుత్ పుట్టిస్తున్నాం, వర్షం నీటిని ఎందుకు వాడొద్దని సందేహం కలిగింది. స్నేహితులతో, తండ్రితో ఇదే విషయాన్ని చర్చించింది.

ఈ విషయానికి పదును పెట్టి ఒక పరికరాన్ని తయారు చేయాలనుకున్నది. దీనికి ఫిజిక్స్ టీచర్ల సలహాలను తీసుకొని నాలుగు నెలల కాలంలో డిజైనింగ్ పూర్తి చేసింది. అజర్‌ బైజాన్ దేశ ప్రభుత్వం 20వేల డాలర్లు ఆమెకు అందించి ఈ పరికరం తయారీకి తోడ్పడింది.  9 మీటర్ల ఎత్తు ఉండే ఈ పరికరంలో నాలుగు భాగాలుంటాయి. ఒకదాంట్లో వర్షం నీటిని తీసుకొంటుంది. ఈ నీరు వాటర్ ట్యాంక్‌ లోకి చేరుకుంటుంది. అది కూడా ఏడు లీటర్ల కెపాసిటీ మాత్రమే ఉంటుంది. అక్కడి నుంచి జనరేటర్, బ్యాటరీ పని చేసి ఆ నీటిని విద్యుత్‌గా మారుస్తాయి. ఈ రెనెర్జి వల్ల ఇంటికి కావాల్సిన విద్యుత్ పొందవచ్చు. అంటే 22 LED లైట్స్ ను వెలిగించుకోవచ్చు. ఒకవేళ అవసరమైన కరెంట్‌ ని వాడుకొని మిగతా కరెంట్‌ ని బ్యాటరీ బ్యాకప్ తీసుకుంటుంది. దీనిద్వారా వర్షం లేనప్పుడు ఆ కరెంట్‌ ని వాడుకోవచ్చునన్నమాట. తక్కువ ఖర్చుతో తయారైన దీని ద్వారా  22 వాట్ల కరెంట్‌ ని పొందొచ్చు. సో చిన్న కుటుంబాలు దీన్ని కనుక వాడుకుంటే వారి కరెంట్ కష్టాలు తీరిపోతాయంటోంది రేహాస్. అతిచిన్న వయసులోనే అరుదైన పరికరాన్ని కనిపెట్టిన రేహాస్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates