వర్షానికి నదిలో కొట్టుకుపోయిన మహిళ..కాపాడిన NDRF సిబ్బంది

గుజరాత్, ఉత్తరాఖండ్, మణిపూర్ లలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. హరిద్వార్ లో ఓ నదిలో కొట్టుకుపోతున్న మహిళను కాపాడారు NDRF సిబ్బంది. బోట్ సాయంతో.. వరదలకు ఎదురెళ్లి మహిళను సేఫ్ గా ఒడ్డుకు చేర్చారు.  గుజరాత్ లోని నవసారిలో కురిసిన భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు చేరింది. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి.

ఉత్తరాఖండ్ లో పరిస్థితి తీవ్రంగా ఉంది. పితోడ్ గడ్ లో అండర్ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. డెహ్రాడూన్ లోని శాస్త్రీనగర్ లో గోడ కూలి నలుగురు చనిపోయారు. ఇద్దరు గాయపడ్డారు. డెహ్రాడూన్, నైనిటాల్ లలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. మణిపూర్ లోని తామెంగ్లాంగ్ లో భూమి కోతకు గురవ్వడంతో 9మంది చనిపోయారు.  హిమాచల్ ప్రదేశ్ లోని సర్మూర్ లో వాగులో ఇరుక్కు పోయింది ఆర్టీసీ బస్సు. దాంతో ట్రాక్టర్ల సాయంతో బస్సును బయటకు లాగారు. బస్సు ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలు కాలేదు.

Posted in Uncategorized

Latest Updates