వర్షాలకు తడిసిన ప్రతి గింజను కొంటాం : రాష్ట్ర ప్రభుత్వం

అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పంట నష్టంపై అధికారులతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ శనివారం హైదరాబాద్ లో సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. జనగామ, జగిత్యాల, నిర్మల్, మహబూబాబాద్, తాండూర్, మేడ్చల్, మంచిర్యాల.. ఇతర ప్రాంతాల్లో అకాల వర్షాలతో కలిగిన పంట నష్టంపై వివరాలు అడిగారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న పరిస్థితులపైనా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా సమీక్ష జరిపారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేసి… నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సూచించారు. పౌరసరఫరాల భవన్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్న అకున్ సబర్వాల్… ఫిర్యాదుల కోసం వాట్సప్  తో పాటు టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేశారు.

Posted in Uncategorized

Latest Updates