వర్షాలతో దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం: ఈటల

etelaఅకాల వర్షాలతో దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు మంత్రి ఈటల రాజేందర్‌. సెక్రటేరియట్ లో ధాన్యం సేకరణ, తమిళనాడుకు బియ్యం సరఫరా, తదితర అంశాలపై అధికారులతో సమావేశం అయ్యారు. అన్నదాతలను అన్ని విధాల ఆదుకుంటామన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాలు పెంచామన్నారు. రైతుల నుంచి చివరి బస్తా వరకూ కొనుగోలు చేస్తామన్నారు. బియ్యం అక్రమ రవాణాపై పీడీ యాక్ట్‌ పెడుతున్నామన్నారు. డీలర్ల కమీషన్‌ పెంపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి ఈటల.

Posted in Uncategorized

Latest Updates