వలలో పడ్డారు : ఏసీబీకి చిక్కిన GHMC హెల్త్ ఆఫీసర్

లంచం తీసుకుంటూ ఓ GHMC ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. సికింద్రాబాద్ జోన్ కార్యాలయంలో హెల్త్ ఆఫీసర్ పని చేస్తున్న వెంకట రమణ రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను   రెడ్ హండెడ్ గా పట్టుకున్నారు. తార్నాకకు చెందిన క్యాటరింగ్ సర్వీస్ యజమాని అబ్దుల్ అహ్మద్ దగ్గర వెంకట రమణ రూ. 60 వేలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. వెంకట రమణ కార్యాలయంతో పాటు ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

అబ్దుల్ అహ్మద్ కు GHMC  నుంచి ఫోన్ చేస్తున్నామంటూ హెల్త్ ఆఫీసర్ ఫోన్ చేశారు. క్యాటరింగ్ కు ఎలాంటి అనుమతులు లేవని అనుమతులు తీసుకోవాలని చెప్పారు. మీపై రామకృష్ణ ఫిర్యాదు చేశాడని అతనితో మాట్లాడుకోమని హెల్త్ ఆఫీసర్ సలహా ఇచ్చారు. రామకృష్ణ తో మాట్లాడిన కేటరింగ్ యజమాని ఏసీబీ అధికారులను సంప్రదించాడు. రామకృష్ణ హెల్త్ ఆఫీసర్ ఇద్దరూ కలిసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అలర్టైన ACB అధికారులు ప్లాన్ ప్రకారం రామకృష్ణ, హెల్త్ ఆఫీసర్ తో బేరసారాలు నిర్వహించారు. 60వేలు డిమాండ్ చేసిన రామకృష్ణ హెల్త్ ఆఫీసర్ తో మాట్లాడి ఫైనల్ గా 20 వేలకు సెటిల్ చేశాడు. 20 వేలు లంచం తీసుకుంటూ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ ఏసీబీ అధికారులకు రెడ్ హండెడ్ గా పట్టుబడ్డాడు. రామకృష్ణ, హెల్త్ ఆఫీసర్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు. రామకృష్ణ తార్నాక ఏరియాలో ఒక దిన పత్రికలో విలేకరిగా పని చేస్తున్నాడు.

Posted in Uncategorized

Latest Updates