వాకింగ్‌కు వెళ్లిన టీడీపీ నేత దారుణ హత్య

జనగామా జిల్లా ప్రజలు ఉదయాన్నే ఉలిక్కిపడ్డారు. జనగామా నడిబొడ్డున ఓ దారుణ హత్య జరిగింది. వాకింగ్‌కు వెళ్లిన టీడీపీ నేత, మాజీ కౌన్సిలర్ పులిస్వామిని హన్మకొండ రోడ్డులో ప్రత్యర్థులు గొడ్డలితో నరికి చంపారు. ఈ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. రోజూవారీగా పులిస్వామి గురువారం కూడా వాకింగ్ కోసమని ఇంట్లో నుంచి బైక్‌పై బయలుదేరాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత ఆయనపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేశారు. గొడ్డళ్లతో నరకడంతో పులిస్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పథకం ప్రకారమే పక్కా స్కెచ్‌తో ఈ హత్య చేసినట్లు పోలీసులు అంటున్నారు.

Latest Updates