వాజ్ పేయి స్మారకార్థంగా వంద నాణెం

ఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి స్మారకార్థం…..వంద రూపాయల నాణాన్ని రిలీజ్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. సోమవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన మోడీ…అటల్ జీ స్థాపించిన పార్టీ ఇప్పుడు అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించిందన్నారు. వాజ్ పేయి దగ్గర శిక్షణ పొందిన కార్యకర్తలు అదృష్టవంతులన్నారు.

ఒక వ్యక్తిగా వాజ్ పేయికి ఎవరూ సాటిలేరన్నారు. అట‌ల్‌ జీ మొద‌ట జ‌న్‌ సంఘ్‌ ను నిర్మించార‌ని, కానీ.. ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవ‌స‌రం రాగానే ఆయ‌న జ‌న‌తా పార్టీలోకి వెళ్లాల్సి వ‌చ్చింద‌ని గుర్తు చేశారు ప్రధాని మోడీ.

Posted in Uncategorized

Latest Updates