వాట్సప్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ సమస్యలకు చెక్

whtsapp
ఇకపై స్థిరాస్థుల, దస్తావేజుల రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్ రైటర్ల నుంచి ఇబ్బందులు తప్పనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈసమస్యలకు పరిష్కారం చూపించేందుకు స్టాంపులు, రిజిస్ట్రేన్లశాఖకు ప్రత్యేకంగా వాట్సప్ మొబైల్ నెంబర్ 7093920206ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజలు ఈ వాట్సప్ నెంబర్ కు మీ సమస్యను పంపిస్తే తక్షణమే  అధికారులు స్పందించి పరిష్కారాని చూపిస్తారు.  భూమి రిజిస్ట్రేషన్‌లు కావడం లేదని, కొంత ముట్టజెపితే చేస్తున్నారని, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కొందరు దళారులు ఈ దందా చేస్తున్నట్టు ఇటీవల ఫిర్యాదులు రావడంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.

సందేహాలు, అనుమానాలు, ఫిర్యాదులను వాట్సప్ నంబర్‌కు పంపితే, సంబంధిత జిల్లాల డీఐజీలు, రిజిస్ట్రార్లకు చేరవేస్తామని జాయింట్ కమిషనర్ శ్రీనివాసులు చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates