వాట్సప్ మెసేజ్ లను నమ్మి దాడులకు పాల్పడొద్దు

ఇప్పుడు ప్రపంచమంతా వినిపిస్తున్న ఒకేఒక పదం వాట్సప్. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు దాన్నేకలవరిస్తుంటారు. గుడ్ మార్నింగ్ అంటూ ఒకరు పెడితే.. మరొకరు గుడ్ నైట్ అంటూ ముగిస్తారు. ఈ యాప్ లో కొన్ని సార్లు ఫేక్ మెసేజ్ లు వస్తుంటాయి. వాటిని మరొకరికి షేర్ చేయడంతో పాటు

నకిలీ వార్తలు, వదంతులను నమ్మి అమాయకులపై దాడులకు పాల్పడుతున్నారు. అలాంటి దాడులు ప్రస్తుతం పెరిగిపోతున్నాయి. పిల్లలను ఎత్తుకుపోయే ముఠాలంటూ వచ్చే వాట్సాప్‌ మెసేజ్ లను నమ్మి చట్టాన్ని ప్రజలు చేతుల్లోకి తీసుకుంటున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటీ వల కర్ణాటకలోని బీదర్‌లో ముగ్గురు హైదరాబాదీలను పిల్లల కిడ్నాపర్లుగా భావించి వారిపై స్థానికులు దాడులు చేశారు. ఆ దాడిలో ఆజం అనే వ్యక్తి మృతి చెందాడు. రాష్ట్రంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఈ క్రమంలో నకిలీవార్తలు, వదంతులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఐటీ శాఖ సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించింది. నకిలీ వార్తలు, వదంతులు, పుకార్లను గుర్తించేందుకు సూచనలు జారీ చేసింది.

కావాలని రెచ్చగొట్టేట్లు ఉన్న మెసేజ్ ల్లో అసత్యాలు ఉంటాయని… వాటిని చదివి ఆవేశపడకండి అంటూ సూచిస్తున్నారు. అంతేకాదు నిజాలు తెలుసుకోకుండా ఫార్వర్డ్‌ చేయకండి అంటూ ప్రచారం చేస్తున్నారు అధికారులు. పుకార్లు సృష్టిస్తే శిక్ష తప్పదని…అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు తెలపాలన్నారు. వారిని కొట్టడం వంటి పనులు చేయవద్దని సూచించారు.

Posted in Uncategorized

Latest Updates