వాట్సాప్‌ లో గ్రూప్‌ కాలింగ్‌


మెస్సేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ లో  గ్రూప్‌ కాలింగ్‌  ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లు ఇకపై వాట్సాప్‌లో గ్రూప్‌ వీడియో, వాయిస్‌ కాలింగ్‌ చేసుకోవచ్చని వెల్లడించింది ఆ సంస్థ. ఈ గ్రూప్‌ కాలింగ్‌ ఫీచర్‌తో ఒకేసారి నలుగురితో వీడియో, వాయిస్‌ కాల్‌ మాట్లాడేందుకు వీలుంటుంది. వాట్సాప్‌ ద్వారా రోజుకు 200 కోట్ల నిమిషాల కాల్స్‌ జరుగుతున్నాయి. డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో ఈ గ్రూప్‌ కాలింగ్‌ను తీసుకొచ్చినట్లు వెల్లడించింది ఫేస్‌బుక్‌. 2016 నుంచి వాట్సాప్‌లో వీడియో కాల్స్‌ సదుపాయం ఉంది. అయితే ఇది కేవలం ఇద్దరు యూజర్లకు మాత్రమే పరిమితం. తాజాగా ఈ గ్రూప్‌ కాలింగ్‌ సదుపాయంతో ఒకేసారి నలుగురు యూజర్లు వీడియో లేదా వాయిస్‌ కాల్‌ ద్వారా మాట్లాడుకోవచ్చని స్పష్టం చేసింది ఫేస్‌బుక్‌ కంపెనీ.

గ్రూప్‌ కాలింగ్‌ ఎలాగంటే..

ఈ గ్రూప్‌ కాలింగ్‌ సదుపాయాన్ని ఎలా వినియోగించుకోవాలంటే… ముందు మన కాంటాక్ట్స్‌లోని ఎవరైనా ఒక యూజర్‌కు వాయిస్‌ లేదా వీడియో కాల్‌ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్‌పై కుడివైపున ఉండే బటన్‌ సాయంతో మరో యూజర్‌ను యాడ్‌ చేసుకోవచ్చు. రెండో కాల్‌ కూడా కనెక్ట్‌ అయిన తర్వాత మళ్లీ అదే బటన్‌తో మూడో వ్యక్తిని కూడా యాడ్‌ చేసుకోవాలి. అలా మనతో కలిపి నలుగురు వ్యక్తులతో ఒకేసారి మాట్లాడుకోవచ్చు. అయితే ఈ ఫీచర్‌ కోసం వాట్సాప్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ను యాపిల్‌/గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Posted in Uncategorized

Latest Updates