వాట్సాప్ లో కొత్త ఫీచర్ : ఈ గ్రూప్స్ లో అడ్మిన్ మాత్రమే పోస్ట్ చేయాలి

GROUPవాట్సాప్ తన కస్టమర్ల కోసం కొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వాట్సప్ గ్రూప్ మొత్తం అడ్మిన్ చేతుల్లోనే ఉంటుంది. గ్రూపు సభ్యులు ఏదైనా పోస్ట్ చేస్తే, డైరెక్ట్ గా సెండ్ అవ్వదు. దాన్ని గ్రూప్ అడ్మిన్ సెండ్ చేస్తేనే పబ్లిష్ అయ్యేలా..సెండ్ ఆప్షన్ తీసుకువచ్చింది.

దీనిద్వారా వాట్సాప్ లలో విచ్చలవిడిగా వస్తున్న గ్రూపులలో అసాంఘిక కార్యకలాపాలకు తావిస్తున్న పోస్టులను కంట్రోల్ చేయడానికే ..ఈ కొత్త ఫీచర్ ను తీసుకువచ్చినట్లు తెలిపింది వాట్సాప్. సెండ్ మెస్సేజెస్ ఫీచర్ ను ఆండ్రాయిడ్, IOC, విండోస్ ఫోన్లలోకి అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపింది వాట్సాప్. ఈ ఫీచర్ అడ్మిన్ కు సర్వాధికారాలు కల్పిస్తుంది. గ్రూపు సభ్యులు తమంతట తాము గ్రూపులో మెస్సేజ్ లు చేయకుండా అడ్మిన్ కంట్రోల్ చేయగలరు. కొన్ని నెలలుగా ఈ ఫీచర్ ను డెవలప్ చేసిన వాట్సాప్.. ఇప్పుడు యూజర్లు అందరికీ అందుబాటులోకి తెచ్చింది.

గ్రూపు అడ్మినిస్ట్రేటర్లు గ్రూపు ఇన్ఫోలో, గ్రూపు సెట్టింగ్స్ లోకి వెళ్లి సెండ్ మెస్సేజ్ ఫీచర్ ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఓన్లీ అడ్మిన్స్ (అడ్మిన్లు మాత్రమే) అని, ఆల్ పార్టిసిపెంట్స్ (సభ్యులు అందరూ) అని రెండు ఉంటాయి. ఒకవేళ ఓన్లీ అడ్మిన్ సెలక్ట్ చేసుకుంటే అడ్మిన్లే పోస్ట్ చేయగలరు. సభ్యులకు అవకాశం ఉండదు. అంతేకాదు, ఈ ఫీచర్ సెట్ చేసిన వెంటనే వాట్సాప్ గ్రూపు సభ్యులకు వారికి మెస్సేజ్ లు, ఫొటోలు ఇతరత్రా పోస్ట్ చేయలేరని మెసేజ్ వెళ్తుంది.

 

Posted in Uncategorized

Latest Updates