వాట్సాప్ లో సెక్యూరిటీ లేదా

whatsappలేటెస్ట్ అప్‌డేట్స్ తో వినియోగదారులకు సేవలందిస్తోంది ప్రముఖ మెసేంజింగ్ అప్లికేషన్ వాట్సాప్. అయితే అందరూ అనుకున్నంత సేఫ్టీ కాదంటున్నారు ఎక్స్ ఫర్ట్స్ . వాట్సాప్ ద్వారా ఒక వ్యక్తి మరో వ్యక్తికి పంపే మెసేజ్ లు ఎన్ క్రిప్ట్ అయ్యి సీక్రెట్ ఉండటం నిజమే కావచ్చని..అయితే వాట్సాప్ కాల్ డాటా సహా ఇతర సమాచారం దుర్వినియోగం అవుతుండొచ్చని అమెరికాకు చెందిన ఎక్స్ ఫర్ట్ వివేక్ వాధ్వా తెలిపారు. వాట్సాప్ ను ఫేస్ బుక్ 2014 లో కోనేసింది. వినియోగదారులు వాడుతున్న ఫోన్ వివరాలు, గుర్తింపు తదితరాలను ఫేస్ బుక్ కు అందజేస్తున్నట్లు వాట్సాప్  ప్రకటించిన విషయాన్ని వివేక్ గుర్తు చేశారు. వాట్సాప్ గ్రూప్ చాట్ లలో భద్రత లేదని..ఏదేని గ్రూప్ లోని వ్యక్తికి ఆ గ్రూప్ లో ఉన్న సభ్యులందరి ఫోన్ నంబర్లు తెలిసిపోవడం ఆందోళన కలింగించే విషయమన్నారు. ఫేస్ బుక్ వినియోగదారుల సమాచారం దుర్వినియోగమవడం..గూగుల్ వంటి సంస్థలు యూజర్ల సమాచారాన్ని సేకరించి..నిర్వహిస్తుండటం ఈ క్రమంలో కొత్త నిబంధనలు రావాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు.

Posted in Uncategorized

Latest Updates