వాట్సాప్ షాకింగ్ ఆప్షన్ : ఐదుగురికే ఫార్వర్డ్ అవుతుంది

తప్పుడు వార్తలను కంట్రోల్ చేయటానికి వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొస్తుంది. ప్రస్తుతం టెస్టింగ్ లో ఉన్న ఈ ఫీచర్.. త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు హెచ్చరించటంతోపాటు.. భారతదేశం అయిన గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే తప్పుడు వార్తలు వైరల్ కాకుండా.. వాట్సాప్ ద్వారా ప్రచారం కాకుండా కొత్త ఆప్షన్ తీసుకొస్తుంది. వాట్సాప్‌లో ఫార్వర్డ్‌ అ‍య్యే సమాచారంపై పరిమితి విధించింది. కేవలం ఐదు చాట్లకు మాత్రమే మెసేజ్‌ ఫార్వర్డ్‌ అయ్యేలా నిర్దేశించింది. అదేవిధంగా మీడియా మెసేజ్‌లకు క్విక్‌ ఫార్వర్డ్‌ బటన్‌ను తీసేసింది.

మన దేశంలోనే మెసేజ్‌లు, వీడియోలు, ఫొటోలు ఎక్కువగా ఫార్వర్డ్‌ అవుతున్నాయి. గ్రూప్స్ క్రియేట్ చేయటం,  మల్టిపుల్‌ చాట్లకు మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేసుకునేలా ఫీచర్‌ను కొన్నేళ్ల క్రితమే తీసుకొచ్చింది వాట్సాప్‌. ప్రస్తుతం పెద్ద ఎత్తున్న తప్పుడు మెసేజ్‌లు ఫార్వర్డ్‌ అవుతూ హత్యలు, దాడులు, అరాచకాలకు కారణం అవుతోంది. ఈ క్రమంలోనే వాట్సాప్ ద్వారా ఒకేసారి ఐదు గ్రూపులు లేదా వ్యక్తులకు మించి మెసేజ్‌ను ఫార్వర్డ్‌ అవ్వదు. కేంద్రం నోటీసులకు స్పందించిన వాట్సాప్‌, టెక్నాలజీని వాడుకుని, కొత్త ఫీచర్లతో ఫార్వర్డ్‌ మెసేజ్‌లను గుర్తిస్తామని, ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది. మరికొన్ని రోజుల్లో ఈ ఆప్షన్ యాప్ లో యాడ్ చేయనుంది వాట్సాప్.

Posted in Uncategorized

Latest Updates