వాట్సాప్ లో కొత్త ఆప్షన్ : చాటింగ్ చేస్తూ వీడియో చూడొచ్చు

 వాట్సాప్ లో మరో ఫీచర్ అప్డేట్ అయింది. ఇప్పటి వరకు చాటింగ్ కు మాత్రమే ఉపయోగపడుతున్న వాట్సాప్ .. ఇకపై యూ ట్యాబ్, ఫేస్ బుక్ వీడియోలను .. వేరే బ్రౌజర్ లో కాకుండా వాట్స్ ఆప్ లోనే చూడొచ్చు. ఈ వర్షన్ ‘పిక్చర్ ఇన్ పిక్చర్’ లో మోడ్ లో అందుబాటులో ఉంది. ఇందుకు గాను మీ వాట్సాప్ ను అప్డేట్ చేయాలి. ఈ ఫీచర్ వన్ అండ్ వన్ తో పాటు గ్రూప్ లో కూడా వర్తిస్తుంది.

వాట్సాప్ తెలిపిన వివరాల ప్రకారం.. అప్డేటెడ్ వాట్స్ ఆప్ లో యూ ట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ కు చెందిన వీడియో లింక్ లు వాట్స్ ఆప్ లో వచ్చినపుడు.. వాటిని క్లిక్ చేస్తే.. వాట్సాప్  లోనే వేరే బాక్స్ ఓపెన్ అయి.. అందులోనే వీడియో చూడొచ్చు. వీటిని ఫుల్ స్క్రీన్ చేసి కూడా చూడవచ్చు. వీడియో చూస్తూ చాటింగ్ చేసుకునే వెసులు బాటు ఉంది.

Posted in Uncategorized

Latest Updates