వామ్మో.. నిజంగా షాక్ : 86 ఏళ్ల వయస్సులో.. ఏం ఎక్సర్ సైజులు

exasiceమాజీ ప్రధానమంత్రి.. ఎప్పుడూ నిమ్మలంగా.. ప్రశాంతంగా ఉంటారు.. మిస్టర్ కూల్ కంటే కొంచెం ఎక్కువగా నిద్ర ధ్యానంలో ఉంటారు.. ఆయన దేవగౌడ. ఇప్పుడు ఆయన వయస్సు 86 ఏళ్లు.. హాయిగా ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటున్నారు అనుకుంటున్నారా.. అబ్బే అస్సలు లేదు.. ఈ వయస్సులోనూ 30 ఏళ్ల కుర్రోడు చేయలేని వ్యాయామాలు చకచకా చేసేస్తున్నారు. కాలంతోపాటు ఎక్సర్ సైజుల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా.. తన బాడీని ఫిట్ నెస్ గా ఉంచుకుంటున్నారు. అందుకు ఇంట్లోనే ఏర్పాట్లు చేసుకున్నారు. కార్తీక్ అనే ట్రైనర్ సాయంతో రోజూ వ్యాయామాలు చేస్తున్నారు. అందుకు సంబంధించి ఫొటోలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా.. ప్రధానమంత్రి మోడీ ఫిట్ నెస్ విసిరారు. దీనికి అందరూ స్పందిస్తున్నారు. నిన్నటికి నిన్న ఆయన కుమారుడు కర్నాటక సీఎంకి మోడీ ఫిట్ నెస్ ఛాలెంజ్ విసిరారు. దానికి సమాదానం కూడా చెప్పారు. ఇదే టైంలో మాజీ ప్రధాని HD దేవగౌడ తన ఫిట్ నెస్ రహస్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రతి రోజు ఉదయం 6 గంటలకే తన కసరత్తు మొదలవుతుందని చెప్పారు. రెండు గంటలపాటు ట్రెడ్మిల్, వెయిట్ లిఫ్టింగ్, డంబుల్స్, వాకింగ్ చేస్తుంటానని వెల్లడించారు. ఫొటోలు కూడా విడుదల చేశారు. తక్కువ ఆహారం తీసుకోవటం.. అందులోనూ శాఖాహారం మాత్రమే తీసుకోవటమే తన ఆరోగ్య రహస్యం అని వెల్లడించారు. 86 ఏళ్ల వయస్సులో దేవగౌడ ఎక్సర్ సైజ్ ఫొటోలు కిర్రాక్ పుట్టిస్తున్నాయి. నెటిజన్లు కూడా ఫిదా అయ్యారు. మోడీకి రియల్ ఛాలెంజ్ ఇది అంటూ సెటైర్స్ వేస్తున్నారు..

Posted in Uncategorized

Latest Updates