వాయువేగం : యుద్ధ విమానాల్లో డబ్బు తరలింపు

flait-oneyరాష్ట్రంలోని ATM లలో నగదుకొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో అధిక నగదు నిల్వలున్న ముంబై, కొచ్చి, చెన్నై తదితర రాష్ట్రాల నుంచి నగదును విమాన మార్గం ద్వారా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు రెడీ అయ్యాయి బ్యాంకులు. ఇందుకోసం RBI నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఇప్పటికే అనుమతులు తీసుకొంది. గురువారం(ఏప్రిల్-19) నాటికి నగదు బ్యాంకులకు చేరే అవకాశమున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. నగదును మొదట ATMలలో నింపి ప్రజల తాత్కాలిక అవసరాలను తీర్చడానికి బ్యాంకులు ప్రయాత్నాలు చేస్తున్నాయి. ATM లలో ఎంత నగదు ఉంచారో, తమ దగ్గర ఎంత నగదు నిల్వలు ఉన్నాయన్న లెక్కలను ప్రతి బ్యాంకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని SBI ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ నిర్ణయించింది. అయితే పెద్దనోట్ల రద్దు సమయంలోనే తొలిసారిగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)  విమాన మార్గాల ద్వారా బ్యాంకులకు నగదును తరలించింది. రాష్ట్రంలో ఇప్పడున్న నగదు కొరత దృష్ట్యా  బ్యాంకులే RBI అనుమతి తీసుకొని విమానాల ద్వారా నగదును రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు సిద్దమయ్యాయి.

Posted in Uncategorized

Latest Updates