వాయు కాలుష్యంతో డయాబెటీస్ : తేల్చేసిన పరిశోధనలు

AIR POLUTIONఎయిర్ పొల్యుషన్ తో జలుబు లాంటి చిన్న రోగాలు వస్తుయని ఇప్పటివరకు తెలిసిన విషయం. అయితే వాయు కాలుష్యంతో డయాబెటిస్ ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా మధుమేహ రోగుల సంఖ్య పెరగడానికి గాలి కలుషితం కారణం కావడమేనని చెప్పారు పరిశోధకులు. ఈ మేరకు లాన్సెట్‌ లో ఓ రిపోర్టును వెలువరించారు. మధుమేహం రావడానికి కారణాల్లో గాలి కాలుష్యం ఒకటని వెల్లడించారు.

దీన్ని బట్టి చూస్తే భారత్‌ పెనుప్రమాదంలో ఉన్నట్లు అర్థం అవుతుంది. కాలుష్య కోరల్లో చిక్కుకున్న న్యూఢిల్లీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్‌ లో గాలి కాలుష్యాన్ని నివారించేందుకు ప్రత్యేక పాలసీలు ఏమీ లేవు. కలుషిత గాలి ఇన్సులిన్‌ ఉత్పత్తిపై ప్రభావం చూపి, రక్తంలోని గ్లూకోజ్‌ ను శక్తిగా మారకుండా అడ్డుకుంటుంది. తక్కువ ఆదాయ దేశాల్లో ఎలాంటి ప్రత్యామ్నాయ పాలసీలు లేకపోవడం వల్ల అక్కడ పరిస్థితి దయనీయంగా ఉన్నట్లు రిపోర్టులో ఉంది.

ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ(EPA), ప్రపంచ ఆరోగ్య సంస్థ( WHO)లు అతి తక్కువ కాలుష్యంగా గుర్తించిన ప్రదేశాల్లోనూ డయాబెటిస్‌ విజృంభించిందని పరిశోధకులు రిపోర్టులో తెలిపారు. 2016లో గాలి కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల డయాబెటిస్‌ కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. గాలి కాలుష్యం వల్ల 42 లక్షల మంది చనిపోయారని ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి గోల్స్‌ రిపోర్టు-2018లో తెలిపింది. దీంతో బయటకు వెళ్లేముందు తప్పనిసరిగా పొల్యుషన్ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు పరిశోధకులు.

Posted in Uncategorized

Latest Updates