వారంలో రెండు రోజులు: రాత్రి ఒంటి గంటవరకు బార్లు


బార్ల సమయాన్ని అదనంగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రాత్రి 12 గంటలకు మాత్రమే అనుమతించే వారు. అయితే ఈ గంట పొడగింపు వారం మొత్తం కాదు…కేవలం శుక్ర,శనివారం రెండు రోజులు మాత్రమే. ఈ పొడగింపు నిబంధన GHMCతో పాటు…ఐదు కిలోమీటర్ల పరిధిలోనిక బార్లకే వర్తిస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం(ఆగస్టు-2) ఉత్తర్వులు  జారీ చేశారు. ప్రస్తుతం రూల్స్ ప్రకారం అన్ని వర్కింగ్ డేస్ లో బార్లను ఉదయం 10 గంటల నుంచి …రాత్రి 12 గంటల వరకు ఉంచే  అవకాశం ఉంది. వీకెండ్ రద్దీ ఎక్కువగా ఉండటంతో మరో గంట టైం అదనంగా పెంచాలంటూ బార్ల యజమానుల సంఘం విజ్ఞప్తి  చేసింది.  దేశంలోని మెట్రో నగరాల్లో లిక్కర్ అమ్మకాలను పరిశీలించిన  ఎక్సైజ్ శాఖ వారంలో రెండు రోజులు గంట అదనంగా అమ్మకాలకు అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.

శుక్ర,శనివారాలు మినహా మిగతా రోజుల్లో ఈ నిబంధన వర్తించదు. పాత టైమింగ్సే ఉంటాయి.

Posted in Uncategorized

Latest Updates