వారం తర్వాత వెలుగులోకి : వర్థమాన సంగీత దర్శకుడు అనురాగ్ ఆత్మహత్య

ANURAGషార్ట్ ఫిల్మ్ ప్రపంచం షాక్ అయ్యింది. ఔత్సాహిక నటులు, దర్శకులు, రచయితల అవాక్కయ్యారు. ఎందుకంటే.. షార్ట్ ఫిల్మ్ తీసే అందరికీ సుపరిచితుడు అయిన వర్థమాన సంగీత దర్శకుడు అనురాగ్ వినిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. 23 ఏళ్ల ఈ కుర్రోడు ఎప్పుడూ చలాకీగా ఉంటాడు. సినిమా అంటే పిచ్చి. సంగీతం అంటే ప్రాణం. మూడేళ్లుగా సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే.. షార్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీలకు సంగీతం అందిస్తున్నాడు. అనురాగ్ వినిల్ సంగీతం అందించిన వాటిలో అడవి కాచిన వెన్నెల, ఐ మీ హైసెల్ఫ్, నేను వస్తున్నా, పల్లకి, హల్ చల్, ఇట్స్ మై బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉన్నాయి. కొన్నిటికి ఆడియోగ్రఫీ కూడా చేశాడు. అనురాగ్ కంపోజ్ చేసిన పాటల్లో నీలాకాశం, వందేమాతరం, ఓ చెలియా పాటలు ఫేమస్. అదే విధంగా కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేశాడు.

అనురాగ్ ఆషామాషీ కుర్రోడు కాదు. లండన్ లోని SAE ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ లో ఆడియో ఇంజినీరింగ్, మ్యూజిక్ ప్రొడక్షన్ లో డిప్లమా చేశాడు. డైరెక్టర్ సుకుమార్, రాంగోపాల్ వర్మ ప్రాజెక్టుల్లోనూ పని చేశాడు అనురాగ్ వినిల. ఈ వర్థమాన సంగీత దర్శకుడు ఆత్మహత్య చేసుకున్నది వారం రోజుల క్రితం. జూన్ 8వ తేదీ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటనేది ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. వ్యక్తిగత సమాచారంతోపాటు కెరీర్ కు సంబంధించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ డేట్ గా ఉండే అనురాగ్.. జూన్ 2వ తేదీ రాత్రి 9.25గంటలకు లాస్ట్ పోస్ట్ చేశాడు. ఆ తర్వాత పేజీ అప్ డేట్ చేయలేదు. ఫేస్ బుక్ లో అప్ డేట్ చేయలేదు. అనురాగ్ వినిల ఆత్మహత్య చేసుకున్నాడు అంటేనే ఎవరూ నమ్మలేకపోతున్నారు. గొప్ప సంగీత దర్శకుడు అవుతాడు అంటూ సినీ ఇండస్ట్రీ అంటుండేది. ఆత్మహత్యకు కారణాలు ఏంటీ.. ఎందుకు చేసుకున్నాడు అనేది మిస్టరీ అయ్యింది.

Posted in Uncategorized

Latest Updates