వారం రోజుల్లో హైకోర్టు విభజనపై గెజిట్ : ఎంపీ వినోద్

రాష్ట్రంలో ఎయిమ్స్ కు నిధులు కేటాయించడం సంతోషకరమని ఢిల్లీలో చెప్పారు కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్. విభజన‌ హమీల్లో లేకపోయినప్పటికీ.. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రంపై తీసుకొచ్చిన ఒత్తిడి కారణంగానే…  కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎయిమ్స్ ను మంజూరు చేసిందన్నారు. హైకోర్టు విభజనకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఈ వారం రోజుల్లో వచ్చే సూచనలు ఉన్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు  సంబంధించిన అన్ని అనుమతులు ఇప్పటికే సాధించామని చెప్పిన ఎంపీ వినోద్…. సీతారామ ప్రాజెక్టు సంబంధించిన అనుమతుల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నామన్నారు. రిజర్వేషన్ల‌ పెంపు అంశంపైనా పార్లమెంటులో‌ పోరాటం చేస్తున్నామన్నారు వినోద్.

Posted in Uncategorized

Latest Updates