వారికి ప్రజాదరణ 10% కూడా లేదట

రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన నటులు రజనీకాంత్, కమల్‌హాసన్‌లకు తమిళనాడులో కనీసం 10శాతం ప్రజాదరణ కూడా లేదని స్పష్టమైంది. ప్రముఖ తమిళ న్యూస్ ఛానల్ దినతంతి…పుదుచ్చేరి,తమిళనాడులో జరిపిన సర్వేలో ఈ విషయాన్ని తెలిపింది.

మక్కల్‌ నీది మయ్యం పేరుతో పార్టీని స్థాపించిన కమల్‌ రాష్ట్రంలో పర్యటిస్తుండగా… రజనీ మాత్రం పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో ఉన్నారు. వచ్చే ఏడాది ఎన్నికల క్రమంలో రజనీ, కమల్‌ రాజకీయ ప్రవేశంపై ‘దినతంతి’ న్యూస్‌ ఛానల్  జరిపిన సర్వేలో.. కమల్, రజనీ రాజకీయాల్లో ఏమీ సాధించలేరని 51 శాతం మంది చెప్పగా.. వారి రాజకీయ ప్రవేశంపై పది శాతం మంది కూడా సానుకూలంగా లేరని ఛానల్ తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates