వారికి మాత్రమే.. జియో డబుల్ డేటా ఆఫర్

jio
రిలయన్స్ జియో మరో బంపరాఫర్ ప్రకటించింది. చైనా మొబైల్ దిగ్గజం షియోమి కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్లు రెడ్‌మీ నోట్ 5, రెడ్‌మీ నోట్ 5 ప్రొలను విడుదల చేసింది. ఈ నెల 22వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఈ ఫోన్లు అమ్మకానికి రానుంది. అయితే ఈ ఫోన్లపై అప్పుడే జియో బంపరాఫర్ ప్రకటించింది. షియోమీతో భాగస్వామ్యం అయిన జియో డబుల్ డేటా ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అలాగే రూ.2,200 విలువైన ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ ను కూడా అందిచనుంది.

షియోమీ రెడ్‌మీ నోట్ 5, నోట్ 5 ప్రొ ఫోన్లను కొన్నవారు వాటిల్లో జియో సిమ్ వేసి రూ.198,రూ.299 ప్లాన్‌లతో మై జియో యాప్‌లో రీచార్జి చేసుకుంటే వారికి రూ.2,200 విలువైన ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ 44 వోచర్ల రూపంలో లభిస్తుంది. ఒక్కో వోచర్ విలువ రూ.50 ఉంటుంది. వీటిని తర్వాత చేసుకునే రూ.198, రూ.299 రీచార్జిలపై వాడుకుని డిస్కౌంట్‌ను పొందవచ్చు.

రూ.198 అంతకన్నా ఎక్కువ విలువ గల ప్లాన్లను రీచార్జి చేసుకుంటే కస్టమర్లకు డబుల్ మొబైల్ డేటా లభిస్తుంది. మొదటి 3 రీచార్జిలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంటే వినియోగదారులు రూ.198 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే ఒక్కోసారి 112GB డేటా చొప్పున మొత్తం 3 సార్లకు గాను 336 GB డేటా వస్తుందన్నమాట.

Posted in Uncategorized

Latest Updates